Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సింగీతం శ్రీనివాసరావుగారు.. తెలుగు సినిమాకు తన ప్రయోగాలతో తిలకం అద్దిన గొప్ప దర్శకులు. 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. తండ్రి ఒక హెడ్మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేప్పుడు నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు. సినిమాలపై మక్కువతో తనకు ఇష్టమైన దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అప్రెంటిస్‌గా తన సినిమా ప్రయాణం మొదలుపెట్టిన సింగీతం గారు అసోసియేట్ డైరెక్టర్‌గా దొంగ రాముడు, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, మాయాబజార్, జగదేకవీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధంకు పని చేశారు. 1972లో తన తొలి తెలుగు చిత్రం నీతి నిజాయితీతోనే తనదయిన ముద్ర వేశారు. మయూరి, ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచారు.
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
పుష్పక విమానంతో మూకీ సినిమా, ఆదిత్య 369లో టైమ్ మెషిన్ లో వర్తమాన కాలం నుండి భవిష్యత్ కాలానికి వెళ్లడం, సింగ్ గీతం సినిమాతో పాటలనే మాటలుగా సినిమా చేయడం వంటి ఎన్నో ప్రయోగాలతో వెండితెరపై అద్భుతాలు సృష్టించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీసిన మయూరి సూపర్ హిట్ కావడమే కాకుండా ఏకంగా 14 నంది అవార్డులను గెలుచుకుంది. భైరవ ద్వీపం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. తన సినీ ప్రయాణంలో 60 సినిమాలు చేసి.. సింగీతం అంటే ప్రయోగం.. ప్రయోగం అంటే సింగీతం అనేలా ఖ్యాతిని అందుకున్నారు.
94 ఏళ్ల వయసులో ఇటీవల సింగ్ గీతం అనే సినిమాకు దర్శకత్వం వహించి తనకు వయసుతో సంబంధం లేదని తాను ఎప్పటికి రిటైర్మెంట్ తీసుకోనని తనసినిమాలలో వైవిద్యం ఏపాటిదో ఈతరం జెన్ జీ జనరేషన్ కు చూపించారు సింగీతం గారు. అయితే గత కొద్దిరోజులుగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న సింగీతం గారు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూసారు. మానవ జన్మ అన్నాక ఎదో ఒక రోజు కాలం చేయాల్సినవారే. కానీ అందరిలా వెళ్ళిపోతే ఆయన సింగీతం ఎందుకు అవుతారు. తానూ ఎంచుకున్న కళారంగంలో కనివిని ఎరుగని సినిమాలతో వెండితెరపై ఎవరు చేయనటువంటి అద్భుతాలు సృష్టించి కళామతల్లి ముద్దుబిడ్డగా జేజేలు అందుకున్నారు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన తీసిన సినిమాలు చేసిన ప్రయోగాల రూపంలో ఎప్పటికి చిరస్థాయిలో నిలిచి ఉంటారు. కానీ ఇన్నేళ్లుగా సినిమా మాంత్రికుడుగా సింగీతం తయారుచేసిన ప్రయోగశాల నేటి నుండి మూతపడింది.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!