CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. యూనివర్సిటీకి సేవలందించిన వారి పేరు పేరున అభినందనలు తెలియజేసిన ఆయన, తాను రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటూ.. ఇది కేవలం విద్యాసంస్థ మాత్రమే కాకుండా ఒక గొప్ప బ్రాండ్‌గా ఎదిగిందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే స్థాపించబడిన ఈ యూనివర్సిటీ, రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 58 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుండటం విశాఖపట్నాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఘట్టమని చెప్పారు.
Also Read
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇక్కడ భారీ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుండటం విశాఖ ప్రతిష్టను మరింత పెంచుతుందని అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ రావడం విశేషమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశాన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించామని గుర్తుచేసిన సీఎం, రాష్ట్రంలో ఉన్న 53 యూనివర్సిటీలకు ఇది దిక్సూచి లాంటిదని అభివర్ణించారు. జైపూర్ రాజు విక్రమదేవ్, విజయనగరం గజపతి రాజవంశం, పిఠాపురం మహారాజు, నూజివీడు జమీందార్లు, బొబ్బిలి రాజులు వంటి అనేక మంది ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. వారి సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు.
తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగ రెడ్డి బలమైన పునాదులు వేసారని, తరువాతి వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ రాష్ట్రపతిగా ఎదిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ యూనివర్సిటీ నుంచి ఎన్నో గొప్ప వ్యక్తులు వెలువడినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!