డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాచురల్ స్టార్ నాని రెండోసారి కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సరిపోదా శనివారం’. ఇదివరకు వీళ్ళిద్దరూ కలిసి ‘అంటే సుందరానికి’ సినిమాను చేశారు. ఆ సినిమాలో హీరో నాని కాస్త సాఫ్ట్ పాత్రలో కనిపించగా.. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎప్పుడు లేని విధంగా క్యారెక్టర్ లో హీరో నాని నటిస్తున్నాడు.
Also Read: MS Dhoni: అక్కడ భారీ సిక్స్ లతో రెచ్చిపోయిన ధోని..!
ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య, కళ్యాణి దాసరి కాస్త భారీ బడ్జెట్ తో.. అలాగే భారీ కాన్వాస్ తో ప్రాజెక్టుని ముందుకు తీసుకెళుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు ఇటీవల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర షూటింగ్ సాగుతోంది. ఇందుకు సంబంధించి మార్చి 18 నుండి నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ను మొదలు పెట్టనుంది. ఈ షెడ్యూల్ లో హీరో నానితో సహా మిగతా నటీనటులు కూడా పాల్గొనేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ లో పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీన్స్ కొన్ని చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాలే సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నాయి.
Also Read: Arvind Kejriwal: వీధి వ్యాపారులపై సర్వే.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం ఇస్తుండగా.. మురళి జి డీవోపీగా పనిచేస్తున్నారు. ఇక ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ పని చేయనున్నారు.