టాలివుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఈ వయస్సు పెరుగుతున్న కూడా ఫిట్నెస్ విషయంలో వెనక్కి తగ్గిదు.. హీరోయిన్ గా ఒకప్పుడు వరుస సినిమాలను చేసింది.. అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఐదు పదుల వయసులో కూడా ఆమె యంగ్ గా కనిపిస్తున్నారు.. అయితే సోషల్ మీడియా మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన పిల్లల ఫోటోలను, మహేష్ బాబు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా నమ్రత స్టైలిష్ లుక్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..
ఓ నగల బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా నమ్రత ఫోటో షూట్ చేశారు. ఆమె లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. ఇక హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ నమ్రత మోడల్ గా రానిస్తూ సంపాదిస్తున్నారు.. అలాగే సితారా కూడా 11 ఏళ్లకే సెలబ్రిటీగా అవతరించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. సితార అంతర్జాతీయ నగల బ్రాండ్ పిఏంజే ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. మొదటి యాడ్ కోసం సితార రూ. 1 కోటి తీసుకున్నట్లు సమాచారం. ఆ వయసులో కోటి సంపాదన అంటే మామూలు విషయం కాదు..
పిల్లల్ని చూసుకోవడంలో నమ్రత కీలక పాత్ర పోషించారు. గృహిణిగా మారి అన్ని విధాలుగా వారిని పోటీ ప్రపంచంలో రాణించేలా సిద్ధం చేశారు.. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్ద వారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు.. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు.
మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం.. ఎప్పుడు ట్రిప్ లకు వెళుతు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు..వీరిద్దరూ వంశీ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం.. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికోస్తే త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..