Nalgonda Road Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఏపీలోని కావలి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన జరిగింది.. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.. తృటిలో పెను ప్రమాదం తప్పింది.
READ MORE: Astrology: నవంబర్ 4, మంగళవారం దినఫలాలు..