Nalgonda Road Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి..