Site icon NTV Telugu

Naini Rajender Reddy : కేటీఆర్ కామెంట్స్‌కి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్‌

Naini Rajender Reddy

Naini Rajender Reddy

Naini Rajender Reddy : వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక వీలువ లేకుండ మాట్లాడుతున్నాడని, ఉద్యమ కాలం లో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా, పోనీ చనిపోయిన వారికీ ఏమైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలని మోసం చేసి ఇప్పడూ సుద్దపూసలాగా మాట్లాడుతున్నావ్ అని ఆయన మండిపడ్డారు. మీరు 10 ఏళ్ళ లో ఏం చేసారు, కేజీ టూ పీజీ ఏమైందని, గొర్ల దాంట్లో దోచుకున్నారు కదా అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. దళిత బంధు మీ చుట్టాలకే ఇచ్చు కున్నారని, మీరు చేసిన పాపాలు వరంగల్ ప్రజలు మరిచిపోలేదన్నారు.

Canada: ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిజ్జర్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్..

అంతేకాకుండా..’ఈ దొంగలు కబ్జా చేసిన ప్లేస్ లో ప్రెస్ మీట్ పెట్టి దొంగ నాటకాలు చేశారు,హౌస్ టాక్స్ కట్టకుండా అందులో కూర్చొని ముఖ్యమంత్రి తిడుతున్నారు,గుడిసెలో వున్నవాళ్లు కూడా కడుతున్నారు.. మీరు 10 ఏళ్ళ లో చేయనివి మేము ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి చేసాము,మీకు దమ్ము ధర్యం ఉంటే చేర్చకు రండి.. రెండు లక్ష ల రుణమాపీ చేసాము మేము అవ్వే పైసలు వుంచుకొని, రైతు బంధు ఇచ్చుకుంటా పోతే కొన్ని ఏళ్ళ గడుచు.. వరంగల్ ప్రజలను రెచ్చగొడుతున్నారు, బి అర్ ఎస్ నాయకులు మీద దేశ ద్రోహ కేసు పెట్టాలని ముఖ్యమంత్రి ని అడుగుతున్న… మూసీ మీద మాట్లాడుతున్నాడు, వీళ్ళు కబ్జా చేసిన భూములు పోతున్నాయి అని… నీ బతుకు దొంగ బతుకు, ప్రశ్నలు అడుగుతుంటే సమాదానం చెప్పకుండా పారిపోతున్నావ్…’ అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ..

Exit mobile version