వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు.
Telangana Elections 2023: తెలంగాణ లోని పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. వివరాలలోకి వెళ్తే.. నేడు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి…
MP Komatireddy: తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వారం రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. నూతన భవనం దగ్గరకు వెళ్లి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.