వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. కొన్ని రోజుల క్రితం తమ బంధువుల అబ్బాయికి ఉద్యోగం కావాలని మంత్రి శ్రీధర్ బాబును కోరడం ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మంత్రులు కమిషన్ తీసుకుంటారు అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.…
Konda Surekha : బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. సిఎస్‌ఆర్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, తాను ఎప్పుడూ మంత్రులు కమిషన్ తీసుకుంటారని మాత్రమే వ్యాఖ్యానించానని, కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి కాదని స్పష్టంచేశారు. అయితే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నేతలు తప్పుడు వీడియో ఎడిటింగ్‌తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన మాటల్ని అసంపూర్ణంగా ప్రచారం చేసి…
వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే ఆయా పార్టీల అధిష్టానాలు ఎన్నికల బరిలోకి దించేందుకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. breaking news, latest news, telugu news, big news, warangal politics
కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో ఆమె సంచలనం. ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో తమ రాజకీయ ప్రస్థానం గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. తాము పార్టీ మారడం లేదని కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు కొండా కపుల్. వరంగల్ తూర్పు మాదే..పార్టీ మరే ప్రసక్తే లేదు.. ఇది అంతా గిట్టని వల్ల ప్రచారం అంటూ కొట్టిపారేశారు. అత్యంత వైభవంగా జరిగిన కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా స్పష్టం చేశారు కొండా దంపతులు. వరంగల్ తూర్పులో కొండా…
సర్వేలలో కొందరు ఎమ్మెల్యేలు వెనకపడ్డారనే ప్రచారం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్లో కాక రేపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చేస్తారనే ఆలోచనలతో.. కొందరు పార్టీ నేతలు కర్చీఫ్‌లు వేసుకునే పనిలో పడ్డారు. కార్యక్రమాల స్పీడ్ పెంచి.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు నానాపాట్లూ పడతున్నారట. పోటీకి సిద్ధమని సంకేతాలు పంపుతున్నారట. ఐదు చోట్ల సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఉందని ప్రచారంవచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ క్రమంగా స్పీడ్ పెంచుతోంది. ఆశావహుల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. ఇంతలో…
గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్‌కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్ఎస్కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే…