వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు.