Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు పోయేలా కనపడుతోంది. తాజాగా జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అరకు పార్లమెంట్ పరిధిలోని రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వారి సంక్షేమమే ధ్యేయంగా జనసేన పనిచేస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు 100% ప్రణాళికలు సిద్ధం చేస్తోందని నాగబాబు అన్నారు. పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తూ, గరిష్ట స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గిరిజన హక్కుల పరిరక్షణకు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను ప్రత్యేకంగా ఎంచుకున్నారని నాగబాబు తెలిపారు. ఈ శాఖ ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధికి అనేక నిధులు కేటాయించినట్లు గణాంకాలతో సహా వివరించారు. ఇందులో ‘అడవితల్లి బాట’ కార్యక్రమం ద్వారా గిరిజన ఆవాసాలకు రహదారులు నిర్మించేందుకు దాదాపు 1,005 కోట్ల రూపాయలను ఖర్చు చేసి.. సుమారు 1,069 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.
Also Read
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
అలాగే పీఎం జన్మన్ నిధుల (PM Janman) నుండి 555 కోట్లు కేటాయించారని, ఇంకా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అత్యధికంగా 2,525 కోట్ల రూపాయలను ఈ ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించారని తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున దాదాపు 50 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు ఆయన వివరించారు. ఈ భారీ నిధుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలు (Water works), అంతర్గత రహదారుల వంటి మౌలిక వసతులను కల్పించడమే కాకుండా.. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు బలమైన ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. కురుడి, డుంబ్రిగూడ, బల్లగరువు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెద్దబాడు వంటి ఎన్నో గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యటించి అక్కడి సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారని నాగబాబు తెలిపారు.
బాక్సైట్ మైనింగ్, హైడ్రోపవర్ ప్రాజెక్టుల వంటి సాంకేతిక విషయాలపై తనకు పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ, ప్రకృతికి ఎటువంటి నష్టం వాటిల్లినా పవన్ కళ్యాణ్ అస్సలు సహించరని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణానికి, గిరిజన జీవన విధానానికి హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా పవన్ కళ్యాణ్ ఎంతమాత్రం ఆమోదించరని, ప్రకృతిని కాపాడుకుంటూనే గిరిజనుల హక్కులను కాపాడటానికి జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాగబాబు మరోసారి గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
-
China: జిన్‌పింగ్‌కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
-
DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
-
Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
-
Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!