Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరొకసారి నటిగా ప్రశంసలు అందుకుంటున్న సమంత, ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది. రిలేషన్షిప్స్, విడాకులు, జీవితంలో ఎదురైన కష్టాలు.. వరుస ఇంటర్వ్యూలలో ఈ విషయాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. సమంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు, ‘మా ఇంటి బంగారం’లో కూడా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా ప్రమోషన్లో కథ కంటే ఆమె వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో చేసిన పోరాటం, విడాకుల తర్వాత ఎదురైన మానసిక ఒత్తిడి, జీవితంలో వచ్చిన ఎదురుదెబ్బలు.. ఇవే ప్రధానంగా ఒక స్ట్రాటజిక్‌గా తన పీఆర్ టీం హైలైట్ చేస్తూ, సింపతీ గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సినిమా కంటే ఎమోషన్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.
సమంత, నాగచైతన్య విడిపోతున్నట్టు 2021 అక్టోబర్ 2న అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ, ఛాన్స్ వచ్చినప్పుడల్లా నాగచైతన్యను, అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది సామ్. నాగచైతన్య మాత్రం వీళ్ళ విడాకులకు సంబంధించి ఎదురైన ప్రశ్నలకు, “అలా జరగకూడదు కానీ జరిగిపోయింది” అంటూ దాటవేశాడు కానీ ఎప్పుడూ సమంతను టార్గెట్ చేయలేదు, నెగిటివ్ కామెంట్స్ చేయలేదు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజాగా తన సినిమా సక్సెస్ మీట్లో సమంత రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ.. “మహిళలు తమను పరిపూర్ణులను చేయడానికి ఒక భాగస్వామి అవసరమని నమ్మకూడదు. ఒక మహిళగా మీపై మీకు నమ్మకం ఉండాలి, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది” అని అంది. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు గతంలో శోభితా ధూళిపాళ్ల చేసిన కామెంట్స్ తో పోలుస్తున్నారు. తన పెళ్ళికి ముందు విడుదలైన ఒక వీడియోలో శోభిత.. “ఒక వ్యక్తి అసంపూర్ణంగా ఉంటాడు, మరొకరు వచ్చి ఆ లోటును భర్తీ చేస్తారని నేను నమ్ముతున్నాను. మనం స్వతహాగా పరిపూర్ణులమే అయినా, నా భాగస్వామి లేకపోతే నా జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది” అని చెప్పింది. ఈ రెండు వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తూ.. సమంత ఇది శోభితకు ఇండైరెక్ట్ కౌంటరా అని చర్చ చేస్తున్నారు. అయితే సమంత ఎక్కడా శోభిత పేరును ప్రస్తావించలేదు. అలాగే నాగచైతన్య కూడా గతంలో శోభితకు తమ విడాకులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ పోలికలు, ఫ్యాన్ వార్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ వరకు.. ఈ కుటుంబం నటులనే కాదు, స్టూడియోలు, నిర్మాణ సంస్థల ద్వారా కూడా పరిశ్రమకు సేవలను అందించింది. ఈ నేపథ్యంలో సమంత సినిమా ప్రమోషన్స్‌లో పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా ప్రస్తావించడం, పాత వివాదాలను మళ్ళీ తెరపైకి తీసుకురావడం అవసరమా? అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!