Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- సియా కంత్రీ ప్రణాళిక
- కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా
- పక్కా ప్రణాళికతో స్కెచ్ అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి ఏర్పాట్ల పేరుతో తన కాబోయే భర్త నుంచి రూ.1 కోటి తీసుకున్న నిశ్చితార్థ యువతి సియా గోయల్.. ఆ డబ్బును తన ప్రియుడు చేతన్ చౌదరికి ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఇద్దరూ కలిసి కేతన్‌ను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితులైన 20 ఏళ్ల సియా గోయల్, ఆమె ప్రియుడు 22 ఏళ్ల చేతన్ చౌదరిని పోలీసుల కస్టడీలో ఉన్నారు. జూన్ 18న పూణె సమీపంలోని లోహగడ్ కోట దగ్గర కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసి హత్య చేవారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
పోలీసుల వివరాల ప్రకారం.. పెళ్లి షాపింగ్, ఏర్పాట్ల కోసం అవసరమని చెప్పి సియా గోయల్ తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ నుంచి రూ.1 కోటి తీసుకుంది. అయితే ఆ డబ్బును పెళ్లి కోసం వినియోగించకుండా తన ప్రియుడు చేతన్ చౌదరికి అప్పగించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన చేతన్.. వ్యాపారం, కెరీర్లో నిలదొక్కుకోవడానికి కనీసం మూడు సంవత్సరాలు అవసరమని సియాకు చెప్పినట్లు విచారణలో వెల్లడైంది.
ప్లాన్ ఇదే
హత్య అనంతరం అనుమానం రాకుండా సియా మూడు సంవత్సరాల పాటు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఇద్దరూ ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలోపు చేతన్ ఆర్థికంగా స్థిరపడతాడని, కేసు కూడా ప్రజల దృష్టి నుంచి దూరమవుతుందని భావించి.. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. అయితే హత్యకు ముందు కూడా ఇద్దరూ పక్కా ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. లోహగడ్ కోట దగ్గర కేతన్‌ను లోయలోకి తోసే ముందు సియా కూర్చోవడమే సంకేతంగా నిర్ణయించారు. నీళ్లు తాగుతున్నట్లు లేదా షూ లేస్ కట్టుకుంటున్నట్లు నటిస్తూ సియా కూర్చోగానే.. వెనుక నుంచి వచ్చిన చేతన్.. కేతన్‌ను లోయలోకి తోసేయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు.. కేతన్ కిందపడే సమయంలో సియాను పట్టుకునే అవకాశం ఉండొచ్చని భావించి.. ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకే ఈ సంకేతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్కూటర్‌పై ప్రయాణమందుకే..
హత్య రోజు చేతన్ పూణె నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలోని లోహగడ్ కోటకు కారులో కాకుండా స్కూటర్‌పై వెళ్లాడు. టోల్ ప్లాజాల్లో కారు నమోదవుతుందనే భయంతోనే స్కూటర్‌ను ఎంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలో ఉపయోగించిన స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. హత్యకు కేవలం 34 నిమిషాల ముందు సియా తన ప్రియుడు చేతన్‌కు రహస్యంగా ఫోన్ చేసినట్లు కాల్ డీటెయిల్ రికార్డుల్లో (CDR) గుర్తించారు. ఇదే హత్యకు తుది సంకేతంగా పోలీసులు భావిస్తున్నారు.
మొదటి ప్రయత్నం విఫలం
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ హత్య కుట్ర మే నెలాఖరులోనే సిద్ధమైంది. జూన్ 14న మొదటిసారి కేతన్‌ను లోయలోకి తోసేందుకు సియా ప్రయత్నించింది. అయితే కేతన్ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో పాము కనిపించడంతో భయపడి అనుకోకుండా తోసేశానని సియా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత జూన్ 18న చేతన్‌ను కూడా వెంట తీసుకెళ్లి రెండోసారి పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసులో మనీ ట్రైల్, కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు, ఇద్దరు నిందితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!