Naga Chaitanya New Web Series: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ గతేడాది విడుదలై.. ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచింది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన దూత అమెజాన్ ప్రైమ్ వీడియాలో రికార్డు వ్యూస్ రాబట్టింది. దూత హిట్ అవ్వడంతో మరో సిరీస్‌లో నటించేందుకు చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ వార్తలకు చై టీమ్ చెక్ పెట్టింది.
Also Read: Babar Azam: బాబర్‌ను తప్పించలేదు.. రెస్ట్ ఇచ్చాం: అజార్
నాగ చైతన్య మరో వెబ్‌సిరీస్‌లో నటించడం లేదని చై టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంతకం చేశారంటూ వచ్చిన వార్తల్లో ఏ నిజం లేదని పేర్కొంది. చై ప్రస్తుతం తండేల్ సినిమాపైనే దృష్టి సారించారని టీమ్ స్పష్టం చేసింది. ఇక చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ రూపొందుతోంది. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాజు అనే మత్స్యకారుడిగా చై కనిపించనుండగా.. బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తండేల్ తెరకెక్కుతోంది.