Babar Azam: బాబర్‌ను తప్పించలేదు.. రెస్ట్ ఇచ్చాం: అజార్
- బాబర్‌కు దక్కని చోటు
- పీసీబీపై విమర్శలు
- స్పందించిన అసిస్టెంట్ కోచ్ అజార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 30, 5 పరుగులే చేశాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో మిగతా రెండు టెస్టుల కోసం ప్రకటించిన పాకిస్థాన్ జట్టులో బాబర్‌కు చోటు దక్కలేదు. బాబర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై పాక్ అసిస్టెంట్ కోచ్ అజార్ మహముద్ స్పందించాడు. బాబర్‌ను జట్టు నుంచి తప్పించలేదని, భవిష్యత్ సిరీస్‌ల నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని తెలిపాడు.
అజార్ మహముద్ మాట్లాడుతూ… ‘బాబర్ అజామ్ మా నంబర్ వన్ ప్లేయర్. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. టెక్నిక్, సామర్థ్య పరంగా అతడు నాణ్యమైన ఆటగాడు. పాకిస్తాన్ వచ్చే రోజ్జుల్లో చాలా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాబర్‌కు విశ్రాంతిని ఇచ్చాం. రెస్ట్ ఇవ్వడానికి ఇది ఉత్తమమైన సమయమని సెలక్షన్ కమిటీ భావించింది. త్వరలో ఆస్ట్రేలియా టూర్ ఉంది. ఆ తర్వాత జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాలి. అవి మాకు ముఖ్యమైన సిరీస్‌లు’ అని చెప్పాడు.
Also Read
- OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
Also Read: Team India: ఒక్కరోజే 400 పరుగులు చేయగల టీమ్ కావాలి: గంభీర్
‘బాబర్ అజామ్‌ను మేం తప్పించలేదు. విశ్రాంతిని ఇచ్చాం. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను టీమ్ మేనేజ్‌మెంట్ అర్థం చేసుకుంటోంది. బాబర్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ.. అతనికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది’ అని అజార్ మహముద్ పేర్కొన్నాడు. పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ఇటీవల బంగ్లా చేతిలో పాక్ ఓడిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..