టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ “నా సామిరంగ”. ఇందులో నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది.నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 న ఆదివారం గ్రాండ్ గా విడుదల అయింది..ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ మరియు వెంకటేష్ సైంధవ్ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి.తాజాగా నాగార్జున నా సామిరంగ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది.ఇదిలా ఉంటే నా సామిరంగ ఓటీటీ డీల్ మరియు ఓటీటీ పార్ట్నర్ వంటి విషయాలు లీక్ అవడం ఆసక్తిగా మారింది. నా సామిరంగ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నా సామిరంగ డిజిటల్ రైట్స్ కోసం మూవీ నిర్మాతలకు డిస్నీ హాట్ స్టార్ భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందని టాక్ వినిపిస్తోంది.
ఇక నా సామిరంగ సినిమాను థియేటర్‌లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. అంటే, వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో నా సామిరంగ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఒక్కసారి ఓటీటీ సంస్థలు సినిమా హక్కులు కొనుగోలు చేస్తే వాటిని విడుదల చేసే నిర్ణయం వారి చేతుల్లోనే ఉంటుందని సమాచారం.. కొన్నిసార్లు నిర్మాతలతో చర్చించి కూడా ఎప్పుడూ ఓటీటీలో రిలీజ్ చేయాలో ప్లాన్ చేసుకుంటారు.ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అయితే.. నా సామిరంగ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు. నా సామిరంగ మూవీ టాక్ మరియు బాక్సాఫీస్ కలెక్షన్స్ దృష్ట్యా విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే నా సామిరంగ సినిమాలో నాగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కూడా ప్రధాన పాత్రలు పోషించారు.నాగ్ కు జోడీగా ఆషికా రంగనాథ్ నటించగా.. రాజ్ తరుణ్ కి జోడిగా రుక్సార్ దిల్లాన్ మరియు అల్లరి నరేష్ కు జోడిగా మిర్నా మీనన్ నటించారు.