రోజు తినే ఆహారం మన శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అయితే.. అందులో కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. ఆ ఆహార పదార్థాల గురించి తెలియకపోవడంతో వాటిని పక్కన పెట్టేస్తుంటారు. అందుకే.. ఈరోజు మనం పుట్టగొడుగులు దాన్ని ఉపయోగాలను గురించి తెలుసుకో పోతున్నాం. పుట్టగొడుగులు అనంగానే చాలామంది వీటిని కూడా తింటారా అనే డౌట్ వస్తుంది. కూరగాయలలో పండ్లలో ఉండేటటువంటి విటమిన్స్, మినరల్స్ కంటే కూడా ఎక్కువగా ఈ పుట్టగొడగులలో అధికంగా ఉంటాయి. పుట్టగొడుగులు విత్తనం లేని మొక్క జాతికి చెందినది. చాలా మంది ఇది శాఖహారమా.. మాంసహారమా అని అనుకుంటూ ఉంటారు. దీన్ని స్మెల్, టేస్ట్ కారణంగా దీన్ని చాలా మంది నాన్ వెజ్ అనుకుంటారు.
కానీ ఇది తప్పు. ఇది ప్యూజ్ వెజ్. ఇప్పుడు రైతులు పంటలను ఏ విధంగా అయితే పండిస్తున్నారో. అదేవిధంగా పుట్టగొడుగులను కూడా ఇప్పుడు చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో చిత్తకార్తె లో మొలుస్తాయి. ఇవి పుట్ట లపై గుట్టలపై ఎక్కువగా గొడుకు ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగులు అని అంటారు. ఇవి మూడు వందల రకాలకు పైగానే లభిస్తున్నాయి. వీటిలో ఆరోగ్యానికి మంచిది చేసేవి ఉన్నాయి. చెడును చేసేయి ఉన్నాయి. వీటిని ఎక్కువగా అందరూ సలాడ్స్, గ్రేవీ, టోపింగ్, సాండ్‌విచ్ పిజ్జా లకు వాడుతూ ఉంటారు. సాధారణంగా విటమిన్ డీ ఆహార పదార్థాల కంటే కూడా సూర్యరశ్మి ద్వారా మనుషుల మీద పడితేనే అది లభిస్తుంది. అదేవిధంగా పుట్ట కొడుకుల మీద కూడా సూర్యరశ్మి పడినప్పుడు దాని వలన కలిగేటటువంటి ఆ కంటెంట్ 4 వేల 6 వందల రెట్లు అధికంగా ఉంటుంది.
వీటిలోని విటమిన్ బి, బి2, బి3, మినరల్స్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ కూడా బీపీ ని షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచడమే కాకుండా బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వీటిని అధికంగా వాడటం వల్ల బోన్ స్ర్తెంత్ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇన్‌ఫెక్షన్‌లు దగ్గరికి రాకుండా చూస్తుంది. మష్రూమ్స్ సూప్ తాగినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. నీరసంగా ఉండేటటువంటి వాళ్ళు బలంగా తయారవుతారు. అంతే కాకుండా ఇది హెయిర్, నేయిల్, టీత్, చర్మం మీద ఉండేటటువంటి ముడతలు పోయి యవ్వనంగా ఉండేటట్టు చేస్తుంది.