Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్‌కు ఘోర ప్రమాదం..
- భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
- రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్‌కు ఫ్రాక్చర్ అయింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musheer Khan: తాజాగా జరిగిన ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మీడియా కథనాల ప్రకారం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముషీర్‌కు ఫ్రాక్చర్ అయింది. ముషీర్ తన తండ్రితో కలిసి కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ముషీర్‌కు గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే., ఇరానీ కప్ మ్యాచ్ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో అక్టోబర్ 1 నుండి 5 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముషీర్ ప్రమాదం ముంబైకి పెద్ద దెబ్బ. ఇది మాత్రమే కాదు, అక్టోబర్ 11 నుండి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు కూడా ముషీర్ దూరం కావచ్చని సమాచారం.
India vs Bangladesh: రెండోరోజు ఆట వర్షర్పణం కానుందా.? కమ్ముకున్న చీకటి మేఘాలు!
Also Read
ముషీర్ ఖాన్ ఇటీవల ఆడిన దులీప్ ట్రోఫీలో అద్భుతాలు చేస్తూ కనిపించాడు. అతను టోర్నీలో ఇండియా B తరఫున ఆడాడు. ముషీర్ తన తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడిని భారత జట్టులోకి తీసుకురావాలనే డిమాండ్ తీవ్రమైంది. అయితే తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ముషీర్ ఖాతా తెరవకుండానే రెండుసార్లు ఔటయ్యాడు. ఇది కాకుండా, అతను ఒకసారి 5 పరుగులు, ఒకసారి 1 పరుగు మాత్రమే చేశాడు. ఇకపోతే ., ముషీర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 15 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 51.14 సగటుతో 716 పరుగులు చేశాడు. ఇందులో అతను 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 203* పరుగులు.
England vs Australia: ఇంగ్లాండ్ దెబ్బకి చిన్నబోయిన ఆస్ట్రేలియా.. భారీ విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు