AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలగు చూస్తున్నాయి.. ఓవైపు ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇచ్చే నజరానా ను ప్రభుత్వం పెంచగా.. మరోవైపు.. ఏకగ్రీవం కోసం ఎవరి స్టైల్లో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. పంచాయతీ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామం వింత నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ఎన్నికల ఖర్చులు, రాజకీయ వివాదాలకు తావులేకుండా సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే గ్రామాభివృద్ధికి ఎవరు ఎక్కువ మొత్తం డబ్బులు ఇస్తారో వారికే సర్పంచ్ పదవి కేటాయించాలనే నిబంధన పెట్టడం ఆసక్తికరంగా మారింది. బెలుగుప్ప మండలం నక్కలపల్లిలో ఈ విధానం మరోసారి అమలైంది.
నక్కలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులను గ్రామస్తులు సమావేశానికి పిలిచారు. గ్రామాభివృద్ధికి తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తామో చీటీల్లో రాసి డబ్బాలో వేయాలని సూచించారు. ఈ విధంగా సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న తొమ్మిది మంది అభ్యర్థులు తాము చెల్లించబోయే మొత్తాలను చీటీల్లో రాసి డబ్బాలో వేశారు. అనంతరం గ్రామస్తులు చీటీలను తెరిచి పరిశీలించగా, సుదర్శనరెడ్డి తన భార్య పేరుతో గ్రామాభివృద్ధికి రూ.25.6 లక్షలు ఇస్తానని రాసినట్లు వెల్లడైంది. తొమ్మిది మందిలో అత్యధిక మొత్తాన్ని ప్రకటించడంతో గ్రామస్తులు ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో ఆయన భార్య సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
Also Read
- AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
- JC Prabhakar Reddy: అనంతపురం అభివృద్ధికి మేయర్ పార్టీ మారాలి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
- Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
- Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
గతంలో రూ.21 లక్షలు.. ఈసారి రూ.25.6 లక్షలు!
నక్కలపల్లిలో ఈ విధానం కొత్తదేమీ కాదు. గత ఎన్నికల్లోనూ ఇదే తరహాలో చీటీల పద్ధతిని అనుసరించారు. అప్పట్లో రామిరెడ్డి రూ.21 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ప్రకటించడంతో ఆయన సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి గత ఎన్నికల కంటే రూ.2.6 లక్షలు అధికంగా కాకుండా, ఏకంగా రూ.4.6 లక్షలు ఎక్కువగా రూ.25.6 లక్షల మొత్తాన్ని ప్రకటించి సుదర్శనరెడ్డి తన భార్యకు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకున్నారు. మొత్తానికి ఎన్నికల ఖర్చులు, పోటీలు, వివాదాలకు దూరంగా ఉండేందుకు నక్కలపల్లి గ్రామస్తులు అనుసరిస్తున్న ఈ చీటీల పద్ధతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ మొత్తంలో గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని ప్రకటించిన వారికి సర్పంచ్ పదవి దక్కేలా చేసిన ఈ విధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!
-
Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
-
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
-
Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!