ఈ మధ్యకాలంలో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిమ్ చేస్తుండగా, వాకింగ్ చేస్తుండగా, ఆడుతుండగా ఇలా చాలా సందర్భాల్లో నేలరాలిపోతున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది.
Read Also: Viral News: ముక్కుతో టైప్ చేసి రికార్డు సృష్టించిన యువకుడు
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కశ్మీరా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే.. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన ముంబైలో ఒకటి జరిగింది. తాజాగా ఈ ఘటనతో ఒక్కసారిగా ముంబైలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై ఆకస్మిక మృతిగా కేసు నమోదు చేశారు.
मुंबई के मीरा रोड में क्रिकेट खेलते समय युवक की मौत pic.twitter.com/YDkZDSp5oM
— Shubham Rai (@shubhamrai80) June 3, 2024
Read Also: Fire Accident :హైదరాబాద్ మూసారాంబాగ్ లో భారీ అగ్ని ప్రమాదం