విభిన్నంగా ఏదైనా చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. దాని కోసం ఎలాంటి కష్టమైన పనులైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వివిధ వ్యూహాలను అనుసరించి.. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకునేందుకు యత్నిస్తారు. ఓ వ్యక్తి ఒక అద్భుతమైన ఫీట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.ఒక వ్యక్తి తన చేతులతో కాకుండా ముక్కుతో టైప్ చేస్తున్నాడు. అది కూడా హై స్పీడ్‌గా టైప్ చేస్తూ ఏకంగా గిన్నిస్ రికార్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. అది ఒకటి రెండు కాదు..ముచ్చటగా మూడోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.
READ MORE: Raveena: తప్ప తాగి కేజిఎఫ్ నటి దాడి.. అసలు విషయం బయటపెట్టిన పోలీసులు
భారత్ కు చెందిన 44 ఏళ్ల వినోద్ కుమార్ చౌదరి తన ముక్కుతో కంప్యూటర్ కీబోర్డులో 25.66 సెకన్లలో ఆంగ్ల వర్ణమాలను టైప్ చేసి తన ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను బద్దలు కొట్టాడు. ఈ వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రెండు రికార్డులను ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన రికార్డును తానే మూడోసారి బద్దలు కొట్టాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. వినోద్ కుమార్ చౌదరి మూడుసార్లు అదే విభాగంలో రికార్డ్ సాధించాడు. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో అతను 26.73 సెకన్లలో టైప్ చేసి రెండవసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈసారి చౌదరి కేవలం 25.66 సెకన్లలో ఈ ఫీట్‌ను పూర్తి చేశాడు.