Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ముంబైలో వినూత్నంగా డబ్బు సంపాదిస్తున్న యువకుడు
- “మీ బాధలు చెప్పుకోండి” అంటూ సేవలు..
- చిన్న సమస్యలకు రూ.250, పెద్ద సమస్యలకు రూ.500 చార్జ్
- కలిసి కూర్చొని ఏడవాలంటే రూ.1000 ఫీజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: మనసు ఉండాలే కానీ.. డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు. ప్రస్తుతం సమాజం ఉన్న కొత్తకొత్త పోకడలతో సమాజంలో కొందరు కొత్తకొత్త ఆలోచనలతో డబ్బులను సంపాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ముంబైలో ఓ యువకుడు చేపట్టిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల వ్యక్తిగత సమస్యలు, బాధలు వినేందుకు డబ్బులు తీసుకుంటున్న ఈ యువకుడి వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దామా..
IPL 2026: వాటంన్నింటికీ దూరంగా ఉండు.. వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ మాస్ వార్నింగ్..!
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్‌పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
వైరల్ వీడియోలో ఓ వ్యతి తన చేతిలో “ఎవరైనా తమ బాధ చెప్పుకోవాలనుకుంటే నేను వినగలను” అనే సందేశంతో హిందీలో రాసిన ఓ బోర్డును పట్టుకుని కనిపించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండోయ్.. అతను అందిస్తున్న ఈ సేవకు ప్రత్యేక రేట్లు కూడా నిర్ణయించాడు. ఇందులో భాగంగా చిన్న సమస్యలు వినేందుకు రూ.250, తీవ్రమైన సమస్యలకు రూ.500, కలిసి కూర్చొని ఏడవాలనుకుంటే రూ.1000 వసూలు చేస్తున్నట్టు తెలిపాడు. ఈ సేవలను అందిస్తున్న వ్యక్తి పేరు ప్రిథ్విరాజ్ బొహ్ర. అతను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ లలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు.
ఇక ఈ విషయాన్నీ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అటుగా వెళ్తున్న సమయంలో అతని వెంటపడింది. అంతే అతను ఈ విషయాన్నీ ప్రపంచానికి చెప్పాడు. ఇక ఆ వీడియోలో “నిజంగా ప్రజలు వస్తారా?” అని అడిగగా.. “అవును, కొందరు వచ్చి తమ బాధలు పంచుకుంటారు” అని చెప్పడం మనం వీడియోలో చూడవచ్చు. కొందరు నా వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటారని, దానికి అనుగుణంగా తాను కూడా పరిశరాలను అందిస్తానని చెప్పడం కొసమెరుపు. ఈ ఘటనతో ప్రజల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది.
అయితే ఈ విషయంపై నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ “ఇది గొప్ప ఆలోచన” అంటుంటే, మరికొందరు “బాధలు వినేందుకు కూడా డబ్బులు తీసుకోవడం సరైనదేనా?” అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు జోవియల్ గా స్పందిస్తూ “ఇదే పని మేము ఫ్రీగా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చేస్తుంటాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇది ఒక బిజినెస్ మోడల్‌గా మారిపోవడం, నగరాల్లో ఒంటరితనం ఎంత పెరిగిందో చూపిస్తోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
On Mumbai beach, this guy charges to hear your problems:
₹250 for Small Problems
₹500 for Big Problems
₹1,000 if you both sit and cry together.— Ghar Ke Kalesh (@gharkekalesh) March 20, 2026
తాజావార్తలు
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?