The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The RajaSaab: థియేటర్లలో సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోతే దాని కథ అక్కడితో ముగిసిపోయిందని అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఓటీటీ వేదికలు సినిమాలకు సెకండ్ లైఫ్ ఇస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో మాత్రం అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుని మరోసారి ప్రభాస్ స్టార్డమ్ ఎంత బలంగా ఉందో నిరూపించింది. జనవరి నుంచి జూన్ 2026 వరకు భారతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రదర్శనపై విడుదలైన ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ నివేదిక ప్రకారం, ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అత్యధికంగా వ్యూస్ సాధించిన దక్షిణాది చిత్రంగా ‘ది రాజాసాబ్’ అగ్రస్థానంలో నిలిచింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ ఏకంగా 17.5 మిలియన్ వ్యూస్ నమోదు చేయడం విశేషం. థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోయినా, ఓటీటీలో మాత్రం ఈ సినిమా పూర్తి భిన్నమైన ఫలితాన్ని సాధించింది.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీలో ప్రభాస్ కొత్త తరహా లుక్ లో కనిపించారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషించారు. విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. అయితే ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించడం విశేషం. ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం మలయాళ సినిమాల ఆధిపత్యం. టాప్ టెన్ జాబితాలో ఏకంగా నాలుగు మలయాళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ‘ద్రిడమ్’ 8.5 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలవగా, ‘వాజా’ 2 7.8 మిలియన్, ‘సర్వం మాయ’ 7 మిలియన్, ‘దృశ్యం 3’ 6.9 మిలియన్ వ్యూస్‌తో జాబితాలో నిలిచాయి.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఇక తెలుగు నుంచి ‘అగ్లీ స్టోరీ’ 8.1 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచింది. ‘అఖండ 2’ 6.6 మిలియన్ వ్యూస్‌తో ఎనిమిదో స్థానంలో నిలవగా, ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ 6.5 మిలియన్ వ్యూస్‌తో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. తమిళం నుంచి ‘బ్లాస్ట్’ 6.8 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో, ‘యూత్’ 4.6 మిలియన్ వ్యూస్‌తో పదో స్థానంలో నిలిచాయి. ఈ గణాంకాలు మరో విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. థియేటర్లలో సినిమా ఫలితం ఎలా ఉన్నా, ప్రభాస్ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేక ప్రేక్షకాదరణ కొనసాగుతోంది. డిజిటల్ విడుదల తర్వాత ఆయన సినిమాలు భారీ సంఖ్యలో వ్యూస్ నమోదు చేయడం ఇప్పుడు సాధారణంగా మారింది. ‘ది రాజాసాబ్’ సాధించిన ఈ రికార్డు కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. ప్రభాస్ మార్కెట్ థియేటర్లకే పరిమితం కాదని, డిజిటల్ ప్రపంచంలో కూడా ఆయనకు ఉన్న క్రేజ్ ఎంత బలంగా ఉందో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
- Tags
- cinema
- The RajaSaab
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?