IPL 2026: వాటంన్నింటికీ దూరంగా ఉండు.. వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ మాస్ వార్నింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: మార్చి 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మొదలు కాబోతుంది. దీనికోసం అన్ని జట్లు వారి కొత్త సహచరులతో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. కొత్త ఏడాది.. కొత్త సీజన్.. కొత్త అంచనాలు. ప్రతిసారి సీజన్ మొదలు కాకముందు నుంచే ఎన్నో ఎక్స్పెటేషన్స్. ఇందులో ఈసారి అందరి దృష్టి 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై ఉందనడం ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ తో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఈ ఎడమచేతి బ్యాట్స్‌మన్, భారీ సిక్సర్లు కొట్టడంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.
Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
2025 ఐపీఎల్ సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్ల భారీ మొత్తంతో వైభవ్ ను కొనుగోలు చేయడం అప్పుడు సంచలనం సృష్టించింది. అయితే మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతడు 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు సాధించి, 36 సగటుతో 206.56 స్ట్రైక్ రేట్‌తో అబ్బురపరిచాడు. జట్టులో సంజు శాంసన్ గాయపడితే అతడికి బదులుగా జట్టులోకి వచ్చిన వైభవ్.. ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై తన రెండో మ్యాచ్ లోనే ఏకంగా 35 బంతుల్లో శతకం బాది, ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా, అలాగే అత్యంత వేగంగా శతకం సాధించిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Kunika Sadanand Marriage: 62 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అంటున్న సీనియర్ నటి..
ఇక అది అంత గతం. ఈ ఏడాదిలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో కూడా వైభవ్ రెచ్చిపోయాడు. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్ పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో ఇప్పుడు ఐపీఎల్ 2026లో వైభవ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందిస్తూ.. వైభవ్ పై ఒత్తిడి పడకుండా చూడాలని తాను ప్రయత్నిస్తున్నట్లు అన్నారు. ఈసారి హైప్, ప్రెషర్ సహజమే.. కానీ ఆ ఒత్తిడిని యశస్వి జైస్వాల్ తీసుకుంటాడు. వైభవ్ కేవలం స్వేచ్ఛగా ఆడితే చాలు అని పేర్కొన్నారు. అంతేకాదు మీడియా దృష్టి నుంచి దూరంగా ఉంచి, అతడు సహజంగా ఆటను ఆస్వాదించేలా చేస్తానని కెప్టెన్ తెలిపారు. దీనితో సీజన్ మొదలు కాకముందే వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ నుండి ఓ వార్నింగ్ అందుకున్నట్లు అయ్యింది.
తాజావార్తలు
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!