Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namitha: ఒకప్పుడు తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన నమిత ఇప్పుడు ఎంతో స్లిమ్‌గా, ఫిట్‌గా మారిపోవడంతో ఇది నిజంగానే నమితేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ ప్రేక్షకులకు నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతం, జెమిని, బిల్లా, సింహా వంటి హిట్ సినిమాల ద్వారా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా గ్లామర్ పాత్రలతో యువతలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆమె, ఒక దశలో తెలుగు, తమిళ చిత్రసీమల్లో అత్యంత బిజీ హీరోయిన్గా కొనసాగారు. అందచందాలతో అభిమానులను ఆకట్టుకున్న నమితకు దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
2017లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న తర్వాత నమిత సినిమాలకు క్రమంగా దూరమయ్యారు. అనంతరం 2022లో 41 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. అప్పటి నుంచి ఫ్యామిలీ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆమె జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిర్రర్ సెల్ఫీలో నమిత పూర్తిగా స్లిమ్ లుక్‌లో కనిపించారు. గ్రే కలర్ క్రాప్ టాప్, డార్క్ గ్రే టైట్స్ ధరించి అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ కనిపించిన ఆమెను చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ ట్రాన్స్ఫార్మేషన్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
సాధారణంగా ప్రసవం తర్వాత మహిళల్లో బరువు పెరగడం సహజం. అయితే నమిత మాత్రం తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కఠినమైన డైట్‌తో పాటు రెగ్యులర్ జిమ్ వర్కౌట్స్ చేస్తూ భారీగా బరువు తగ్గినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో కూడా ఇంత క్రమశిక్షణతో ఫిట్నెస్ను కొనసాగించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. నమిత ఈ కొత్త లుక్ చూసిన తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా అనే చర్చ కూడా సినీ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా, ఆమె ట్రాన్స్ఫార్మేషన్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోతో నమిత మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు తన ఫిట్నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో మరోసారి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.
Wild transformation of Actress Namitha
Can’t beleive my eyes pic.twitter.com/2WUMebhPTi
— மாடு – Maadu(The Cow) (@MaaduOfficial) July 15, 2026
తాజావార్తలు
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..