ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే.. ఐపీఎల్-2023 సీజన్‌లో జరుగుతున్న 31వ మ్యాచ్ ఇది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంటే, పంజాబ్ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఇరు జట్లకూ ఆరేసి పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ ముంబైకి ఎక్కువగా ఉంది. అయితే.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో ముంబై జోరు మీదుంది. మరో వైపు పంజాబ్ ఓటమితో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళురు చేతిలో కంగుతిన్న పంజాబ్ గెలుపుపై కన్నేసింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది.
Also Read : Varla Ramaiah: దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్దమా..?
ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు: అథర్వ తైడే, ప్రభ్ సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేశ్ శర్మ, హర్ ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
Also Read : BJP vs Congress: నిప్పు రాజేసిన ఈటల కామెంట్స్.. భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణానికి రేవంత్ రె’ఢీ’..