Mumbai Indians Welcome back Mahela Jayawardene as Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే రాబోయే సీజన్ కు సంబంధించి ముంబై ఇండియన్స్ (MI) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనేను ఫ్రాంచైజీ కోచ్‌గా నియమించింది. జయవర్ధనే గతంలో కూడా ఈ పదవిలో ఉన్నారు. అతని కోచింగ్‌లో ముంబై ఇండియన్స్ (MI) 2017, 2019, 2020 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకుంది. మార్క్ బౌచర్ స్థానంలో జయవర్ధనే జట్టులోకి తిరిగి రానున్నాడు. గత సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi: హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..
ఇకపోతే., IPL 2024 సీజన్ అంతటా కెప్టెన్ హార్దిక్ మంచి ఫామ్‌లో లేడు. దీంతో పాటు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ రోహిత్ కూడా నిలకడగా రాణించలేకపోయాడు. కెప్టెన్సీ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో జట్టు వాతావరణం కూడా అధ్వానంగా మారింది. దీని ప్రభావం మైదానంలో కూడా కనిపించింది. ఆ సీజన్లో ముంబై కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. 10 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది.
ఇకపోతే ముంబై ఇండియన్స్ లో తన పునః నియామకంపై జయవర్ధనే.. ముంబై ఇండియన్స్ కుటుంబంలో నా ప్రయాణం ఎప్పుడూ ఎదుగుదలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు చరిత్రలో మనం భవిష్యత్తు వైపు చూస్తున్న అదే క్షణానికి తిరిగి రావడం నాకు గర్వకారణం. ముంబై ఇండియన్స్ పట్ల ప్రేమ జట్టును మరింత బలోపేతం చేస్తూ, జట్టు చరిత్రకు దోహదపడటంలో అవకాశం నాకు ఒక ఉత్తేజకరమైన సవాలుగా ఉందని., దీని కోసం నేను ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ లీగ్‌లలో MI ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో MI కేప్ టౌన్ మొత్తం మూడు MI ఫ్రాంచైజీ జట్ల కోచింగ్, స్కౌటింగ్‌ను జయవర్ధనే పర్యవేక్షించారు.
📰 Mumbai Indians Welcome back Mahela Jayawardene as Head Coach 👨🏻🏫
Read more on Mahela’s return as our head coach: https://t.co/QzwnonZJVu#MumbaiMeriJaan #MumbaiIndians | @MahelaJay pic.twitter.com/fq6AZWjUOL
— Mumbai Indians (@mipaltan) October 13, 2024