ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సీజన్ 16లో నిన్న ( శనివారం ) ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వంనించాడు. మెరుపుల ప్రతాపంలో పంజాబ్ కింగ్స్ పైచేయి సాధించింది. 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. తొలుత పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కెప్టెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సామ్ కర్రన్ ( 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు 55 పరుగులు ), హర్ ప్రీత్ సింగ్ ( 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు ), మెరిపించాడు. జితేశ్ శర్మ ( 7 బంతుల్లో 4 సిక్సర్లు ఆఖర్లో శివమెత్తాడు. గ్రీన్, పియూష్ చావ్లా రెండేసి వికెట్లు తీశారు.
Also Read : Amit Shah : అమిత్ షా పర్యటనలో మార్పులు, ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ రద్దు
తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. కెమెరూన్ గ్రీన్ ( 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు ), సూర్యకుమార్ యాదవ్ ( 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు ), రోహిత్ శర్మ ( 27 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సులతో 44 పరుగులు ), టీమ్ డేవిడ్ ( 13 బంతుల్లో 25 నాటౌట్.. 2 సిక్సులు ) చెలరేగాడు. కానీ ఆఖరి ఓవర్ ఫినిషింగ్ లో అర్షదీప్ ( 4/29 ) నిప్పులు చెరగడంతో ముంబై ఇండియన్స్ విజయానికి దూరమైంది. ముంబై గెలుపునకు ఆఖరి ఓవర్ల 16 కావాల్సి ఉండగా.. అర్షదీప్ 2 పరుగులే ఇచ్చి తిలక్ వర్మ ( 3), నేహల్ వధేరా ( 0) వికెట్లను పడగొట్టడంతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
Also Read : CM KCR: అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై కేసీఆర్‌కు బ్రిటన్ ఎంపీ అభినందనలు