Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాదులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆర్ఆర్ఆర్ టీంలో హోం మంత్రి భేటీ రద్దయింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడంతో మంత్రి పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీ నేతలతో జరగాల్సిన సమావేశం కూడా రద్దైనట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గెలవటంతో… షెడ్యూల్ ప్రకారం ఆర్ఆర్ఆర్ టీం సినిమా యూనిట్ ను సత్కరించాలి. కానీ ఢిల్లీలో అత్యవసర భేటీలు ఉండటంతో హైదరాబాద్ కు అమిత్ షా రావటం లేటయ్యే అవకాశముంది.
Read Also: CM KCR: అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై కేసీఆర్‌కు బ్రిటన్ ఎంపీ అభినందనలు
దీంతో అమిత్ షా.. శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల సభ ముగియగానే అమిత్ షా తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా హైదరాబాద్ కి 3.30 గంటలకు రావాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. అక్కడ 6 గంటల నుంచి 7 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. కర్నాటక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అమిత్ షా ఆ వెంటనే ఢిల్లీకి పయనం అవుతారు. మరోసారి హైదరాబాద్ టూర్ కి వచ్చాక ట్రిపుల్ ఆర్ టీమ్ తో పాటు బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నట్లు సమాచారం.
Read Also: PBKS vs MI : రెండో వికెట్ కోల్పోయిన ముంబయి