భారతీయ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అందులో ఒకటి 1960లో విడుదలైన ‘మొఘల్-ఎ-ఆజం’. ఈ సినిమా ఆ కాలంలోనే ఒక సంచలనం. అప్పట్లో ఈ సినిమా మొత్తం బడ్జెట్ కోటిన్నర రూపాయలు కాగా, కేవలం ఒక్క పాట కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేయడం విశేషం. అదే ప్రసిద్ధ ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ సాంగ్. ఈ పాట కోసం వేసిన సెట్ నిర్మాణానికే దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. అలాగే, ఈ పాటలో ప్రతి పదం పక్కాగా ఉండాలని లిరిక్స్‌ను ఏకంగా 105 సార్లు మార్చి రాశారంటేనే ఈ ప్రాజెక్ట్ పట్ల మేకర్స్‌కు ఉన్న నిబద్ధత అర్థమవుతుంది.
Also Read : The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి
ఈ సినిమా సాధించిన వసూళ్లు ఇప్పటికీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. అప్పట్లో కేవలం 1 నుండి 2 రూపాయల టికెట్ ధరతో ఈ సినిమా సుమారు 11 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీనిని ఇప్పటి కలేక్షన్ల ప్రకారం లెక్కిస్తే.. దాదాపు రూ. 3,650 కోట్ల నుండి రూ. 4,000 కోట్ల రూపాయల పైమాటే అవుతుంది. ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉండేదంటే, టికెట్ల కోసం జనం 5 కిలోమీటర్ల మేర క్యూ లో నిలబడేవారని, కొందరైతే టికెట్ల కోసం అక్కడే రెండు రోజుల పాటు రోడ్ల మీద పడుకున్నారని కూడా చరిత్ర చెబుతోంది. భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక చెరిగిపోని రికార్డుగా నిలిచిపోయింది.