మెగాస్టార్ చిరంజీవి, మాస్ అండ్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెంకీ పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ సంబంధం కోసం వచ్చే హీరోగా వెంకటేష్ కనిపిస్తారట. ఇప్పటికే చిరు, వెంకీల మధ్య మంచి స్నేహం ఉండటం.. ఇది తెలియని నయనతారతో వారిద్దరూ కలిసి చేసే కామెడీ డ్రామా సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది.
Also Read : Raja Saab : ‘రాజా సాబ్’ నుంచి ‘నాచే నాచే’ సాంగ్ ప్రోమో రిలీజ్..
ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం మెగాస్టార్ లుక్. సుమారు 25 ఏళ్ల క్రితం చిరంజీవి ఎంత స్లిమ్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవారో, ఈ సినిమాలో మళ్ళీ అదే మేకోవర్‌లో కనిపిస్తున్నారట. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. తన కెరీర్‌లో ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, కథ విన్నప్పుడే తనకు బాగా నచ్చిందని చిరంజీవి స్వయంగా చాలా సార్లు తెలపడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి ఈ ఇద్దరు స్టార్ హీరోల టైమింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురవడం ఖాయం.