Dhoni: జార్ఖండ్ డైనమైట్, ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోని అంటే తెలియని వారుండరు. తనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో తన హెయిర్ స్టైల్ తో ఓ ట్రెండ్ సెట్ చేశాడు. హెలికాప్టర్ షాట్ తో ఓ ఊపు ఊపేశాడు431 52మహేంద్ర సింగ్ ధోని సాక్షి దంపతులకు 2015లో ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు జీవా.. ధోని కూతురు జీవా జార్ఖండ్ రాష్ట్రంలో తల్లిదండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ధోని కూతురి ప్రస్తుత వయసు 8 సంవత్సరాలు. ఈ పాప మూడవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాప చదువుకు ప్రస్తుతం ఎంత ఖర్చు అవుతుందో తెలిసి జనాలు అవాక్కవుతున్నారు.
Read Also:Kishan Reddy: మోడీ నాయకత్వంలో అభివృద్ధి బాటలో ఇండియన్ రైల్వే
జీవా.. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలోనే ఉత్తమ పాఠశాల అయిన టౌరీయన్ వరల్డ్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. అయితే జీవా డేస్ స్కాలర్ చదువుతున్నప్పటికీ తన స్కూలు ఫీజు కింద అక్షరాల రూ.2,75,000లు ధోని దంపతులు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఒకవేళ ధోనీ కూతురు అకాడమినేషన్ ఉన్నట్లు అయితే ఏడాదికి రూ.4.5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండేదట. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తన తండ్రి ధోనీతో పాటు తను స్టేడియంలో సందడి చేసింది. సోషల్ మీడియాలో కూడా ధోని కూతురికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా అకౌంట్లో దాదాపుగా 2.3 మిలియన్ల మంది ఫాలో అవర్స్ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగే సమయంలో ధోని కూతురు జీవా, భార్య సాక్షి కూడా స్టేడియంలో ఉంటారు. ధోని ఒకవైపు వ్యవసాయ పనులు చేస్తూనే మరొకవైపు అభిమానుల కోసం ఐపీఎల్ ఆడుతున్నారు.
Read Also:Rithu Chowdary : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ..