MS Dhoni fooled Yogi Babu at LGM Trailer Launch: క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ధోనీ, ఆయన భార్య సాక్షి నిర్మాతలుగా మారారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలో ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే చిత్రం కోలీవుడ్‌లో తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు రమేష్ తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా, హరీష్ కల్యాణ్ ప్రధాన పాత్రలలో నటించారు. యోగి బాబు, నదియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎల్‌జీఎం సినిమాకు సంబంధించిన ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ జూలై 10న చెన్నైలో ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు ఎంఎస్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో భారత మాజీ కెప్టెన్ ధోనీ.. హాస్యనటుడు యోగి బాబును సరదాగా ఆటపట్టించాడు. లాంచ్ ఈవెంట్‌లో మహీ పక్కన ఉండగా.. యోగి బాబు కేక్ చేస్తాడు. యోగి బాబు కేక్ కట్ చేసి ధోనీకి తినిపిద్దామని స్పూన్ తీస్తుంటాడు. ఈ లోగానే ధోనీ ఓ ముక్క తీసుకుని తినేస్తాడు. దాంతో యోగి బాబు ధోనీని చూస్తూ వైరిటీగా రియాక్షన్ ఇచ్చాడు. ఏంటన్నా ఇది అలా తినేశావ్.. నేను తినిపించేవాడిని కదా? అన్నట్టు చూస్తాడు.దాంతో ధోనీ నవ్వుకుంటాడు.
ఎంఎస్ ధోనీ, యోగి బాబుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. ‘అరె.. ఏంటన్నా ఇది’, ‘ధోనీ ఫన్నీ గయ్’ అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని ‘DHONIsm’ ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ‘వీడియో అఫ్ ది డే.. ఎంఎస్ ధోనీ మొహంలో ఆ ఆనందం చూడు’ అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఎల్‌జీఎం సినిమా ఈ ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: Constipation Remedies: మలబద్ధకం సమస్యతో పడుతున్నారా?.. ఉదయాన్నే ఈ పనులు చేయండి!
Also Read: Food To Avoid With Tea: టీతో పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
https://twitter.com/DHONIism/status/1679729477830717440?s=20