Constipation Remedies: మలబద్ధకం సమస్యతో పడుతున్నారా?.. ఉదయాన్నే ఈ పనులు చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constipation Symptoms and Causes: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య ‘మలబద్ధకం’. మారుతోన్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోకపోవడం వంటి పలు కారణాల మలబద్ధకం సమస్య వస్తుంది. సిగ్గు కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి చాలా సులువుగా బయటపడొచ్చు. కొన్ని అలవాట్లను మీ ఉదయపు దినచర్యలో భాగంగా చేసుకుంటే.. మీ జీవక్రియ వేగవంతం అవడమే కాకుండా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఉదయం పూట ఏ అలవాట్లు పాటించాలో (Constipation Relief) ఇక్కడ చూద్దాం.
నాలుకను శుభ్రం చేసుకోవడం:
పళ్లు తోముకున్న తర్వాత నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల మలబద్ధకం రాదు. ఇది కావిటీస్ తొలగించడానికి సహాయపడుతుంది. అదే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఖాళీ కడుపుతో వ్యాయామం:
జీవక్రియను పెంచడానికి సులభమైన మార్గం ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. మీ బరువు కూడా తగ్గుతుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం ఉత్తమం.
నీరు:
ఆరోగ్యకర జీవనం కోసం మనిషి రోజుకు 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. తక్కువ స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ అయి డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అప్పుడు శరీరం కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వస్తుంటాయి.
Also Read: Food To Avoid With Tea: టీతో పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
గోరువెచ్చని నీరు త్రాగాలి:
ఉదయాన్నే గోరువెచ్చని నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. మలబద్ధకం సమస్య, బరువును తగ్గించుకోవాలనుకుంటే.. మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత రోజు గోరువెచ్చని నీటిని తాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం ద్వారా కడుపుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి బయటపడతారు.
అల్పాహారం:
మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే మంచి అల్పాహారం తీసుకోవాలి. పప్పులు, మూంగ్ దాల్, చినా వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను అల్పాహారంలో చేర్చండి. జంక్ ఫుడ్ తీసుకోవడం మానేసియాలి.
Also Read: Rohit-Ishan Kishan: ఇషాన్ కిషన్ కోసమే ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేశా: రోహిత్ శర్మ
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!