టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్‌లన్నా, కార్లన్నా చాలా ఇష్టం. అందులో భాగంగా తనకు నచ్చిన ప్రతి బైక్, కారును కొనుగోలు చేసి గ్యారేజీలోకి యాడ్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ గ్యారేజీలోకి మరో బైక్ వచ్చి చేరింది. అదే.. టీవీఎస్ రోనిన్. ఈ టూ వీలర్‌ను ధోనీకి డెలివరీ చేసింది టీవీఎస్ మోటార్. టీవీఎస్ స్టార్ సిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతేడాది అపాచీ ఆర్ఆర్ 310ని డెలివరీ తీసుకున్నాడు మహీ. ఇక ఇప్పటికే ధోనీ గ్యారేజీలో కాన్ఫడరేట్ హెల్కాట్ ఎక్స్32, యమహా ఆర్డీ350, హార్లీ డేవిడ్సన్ ఫాట్‌బాయ్, బీఎస్ఏ గోల్డ్‌స్టర్, కవాసాకీ నింజా జెడ్ఎక్స్14ఆర్, కవాసాకీ నింజా హెచ్2 వంటి బైక్స్ ఉన్నాయి. మెర్సిడెస్- బెంజ్ జీఎల్ఈ, ఆడీ క్యూ7, లాండ్ రోవర్ 2, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ వంటి లగ్జరీ కార్లు కూడా ధోనీ తన సొంతం చేసుకున్నాడు.
టీవీఎస్ రోనిన్ ప్రత్యేకతలు..
ధోనీ గ్యారేజీలోకి కొత్త చేరిన ఈ టీవీఎస్ రోనిన్‌లో 225.9సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్- ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 7,750 ఆర్పీఎం వద్ద 20 బీహెచ్పీ పవర్‌ను, 3,750 ఆర్పీఎం వద్ద 19.93 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5- స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్ అసిస్ట్ ఫంక్షన్ కూడా ఉంది. లోయర్- రేవ్ రేంజ్‌లో ఇంజిన్ స్మూత్‌గా ఉంటుంది. గేర్‌బాక్స్ కూడా స్మూత్‌గానే ఉంది. క్లచ్ యాక్షన్ లైట్‌గా ఉంది. ఈ రోనిన్‌లో ఆల్ ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జెస్టెబుల్ బ్రైట్నెస్, 2 ఏబీఎస్ మోడ్స్ (అర్బన్, రెయిన్), సైలెంట్ స్టార్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, గ్లైడ్ థ్రూ టెక్, అడ్జెస్టెబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం.. బైక్ ముందు భాగంలో 41ఎంఎం యూఎస్డీ ఫోర్క్స్, రేర్‌లో సింగిల్ మోనోషాక్‌ను ఉపయోగించారు. డాంపింగ్ కూడా బాగుంది. ఫ్రంట్‌లో 300ఎంఎం డిస్క్ బ్రేక్ ఉండగా.. రేర్‌లో 240ఎంఎం మోనోషాక్ బ్రేక్ ఉంది. హైదరాబాద్‌లో ఈ రోనిన్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.49లక్షలు- రూ. 1.69లక్షల మధ్యలో ఉంది.
Also Read: Virat Kohli: ఇష్టమైన ఫుడ్ దొరికింది.. కోహ్లీ కాక కుమ్మేస్తాడు పో!