Virat Kohli: ఇష్టమైన ఫుడ్ దొరికింది.. కోహ్లీ కాక కుమ్మేస్తాడు పో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. అంతమాత్రాన సొంత ఊరుకు వెళ్లి మనకు నచ్చిన ఫుడ్ తినకపోతే ఎలా! ఇప్పుడు కోహ్లీ కూడా అదే చేశాడు. కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో అందరికి తెలిసే ఉంటుంది. నార్త్ ఇండియాలో మాత్రమే దొరికే చోలే బటురే(రోటి, శనగల కూర).ఈ కాంబినేషన్ అంటే కోహ్లీకి అమితమైన ప్రేమ. మీకు అనుమానంగా ఉంటే గూగుల్‌లో కోహ్లీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని వెతికితే కనిపించే పేరు చోలే బటురే. ఈ వంటకం తింటే తనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని కోహ్లీ కూడా చాలాసార్లు పేర్కొన్నాడు. తాజాగా దానిని మరోసారి నిరూపించాడు విరాట్.
Also Read: Bad Mood : మీ మూడ్ బాగోట్లేదా.. అయితే రోజూ ఇలా చేయండి
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ సమయంలో కోహ్లీ, కోచ్ ద్రవిడ్ డ్రెస్సింగ్‌రూమ్ బయట కూర్చొని ఏదో విషయమై సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో కోహ్లీ వద్దకు టీమిండియా సపోర్ట్ స్టాఫ్ ఒకరు వచ్చారు. విరాట్ మాట్లాడుతుండగా పిలిచి చేతిలో ఉన్న చోలే బటురేను చూపించాడు. అంతే అప్పటివరకు సీరియస్‌గా ఉన్న కోహ్లీ మూడ్ మొత్తం మారిపోయింది. కూర్చొన్న సీటులో నుంచే తనకిష్టమైన చోలే బటురేను చూసి క్లాప్స్ కొడుతూ.. సూపర్.. అక్కడ పెట్టండి వచ్చి తింటా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు కోహ్లీకి చోలే బటురే అంటే ఎంత ఇష్టమో. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు తమకు తోచిన రీతిలో కామెంట్లు పెట్టారు. ”ఇష్టమైన ఫుడ్ కంటపడింది.. కోహ్లీ ఇరగదీయడం ఖాయం.. చోలే బటురే చూస్తే చాలు కోహ్లీలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.”.. ”తొలి ఇన్నింగ్స్‌లో మిస్ అయిన హాఫ్ సెంచరీని.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కవర్ చేస్తాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Virat😂https://t.co/6cvdSHNto8
— Kanav Bali (@Concussion__Sub) February 18, 2023
ఇక తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ రెండో టెస్టులో మాత్రం పర్వాలేదనిపించాడు. 44 పరుగులు చేసి వెనుదిరిగిన కోహ్లీ అర్థసెంచరీ మార్క్‌ను మిస్ అయ్యాడు. అయితే కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. భారత్ ఇన్నింగ్స్ 50 ఓవర్ వేసిన కునేమన్ బౌలింగ్‌లో విరాట్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కోహ్లి ప్యాడ్‌ను తాకింది. అంపైర్ ఔట్ ఇవ్వడంతో కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బంతి బ్యాట్‌కు ముందుగా తగులుతున్నట్లు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన కోహ్లీ కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు.
Also Read: Nikki Yadav Case: రెండో పెళ్లి వద్దన్నందుకే హత్య.. అంతకు ముందే నిక్కీ-సాహిల్ పెళ్లి
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!