స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని నేడు ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా.. దేశంలో అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలంటూ పరోక్షంగానే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అయితే.. ప్రధాని వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతల విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం మీద ఇవాళ ఏం మాట్లాడినా తప్పు అన్నారు. మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రధాని కుర్చీ స్థాయి తగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. బీజేపీలో రాజకీయ వారసులు లేరా అని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్ర దినోత్సవ రోజు ఇలాంటి వ్యాఖ్యలు తగదని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అందరం కలిసి మెలిసి పని చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పెట్టిన డిమాండ్ లు నాకు తెలియదని ఆయన అన్నారు. పార్టీలో అన్ని వ్యవహారాలు సర్దుకుంటాయని ఆయన వెల్లడించారు.