NTV Telugu Site icon

MP Raghunandan Rao : కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేది

Raghunandan Rao

Raghunandan Rao

MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై ఎంపీ రఘునందన్ రావు కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ ఎంపీ రఘునందన్‌ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎవరిని భయపెట్టదని, కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేదన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి పట్టిన దరిద్రం…ఎక్కువ ఎగిరిపడితే జనాలు మళ్ళీ బండకేసి కొడతారన్నారు. దర్యాప్తు సంస్థలు తప్పు చేసిన వారిని ఏ కలుగులో దాక్కున్నా పట్టుకువచ్చి విచారణ చేస్తాయని, కవిత తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు ఎంపీ రఘునందన్‌ రావు. మేము భయపెట్టాలని చూస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత అక్కర్లేదని, కేసీఆర్ నే మొదట తీసుకుపోయేవాళ్ళమన్నారు రఘునందన్‌ రావు. ఎవరు తప్పు చేసినా పోలీసులు కేసులు పెడతారు… కోర్టులోకి తీసుకువెళ్తారని, మీపై కేసులకు మోడీకి అసలు ఏంటి సంబంధమని ఆయన మండిపడ్డారు.

Lokshabha Elections: ఎన్నారై ఓటింగ్ శాతంపై ఆందోళన.. 1.2 లక్షల మందిలో ఓటు వేసింది ఎంత మందంటే?

మీరంతా ఆల్రెడీ సచ్చినా పాములు …మీకు పాలు పోసిన నీళ్లు పోసిన వచ్చేది లేదు సచ్చేది లేదని, మీ జోలికి మేము రావట్లేదు.. మీ చావు మీరు చావండన్నారు ఎంపీ రఘునందన్‌ రావు. మీడియాలో హైలెట్ చేసుకోవడానికి కేటీఆర్, హరీష్, కవిత ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతున్నారని, మీరు తప్ప తెలంగాణలో ప్రతిపక్షంలో ఎవరు లేరా అని ఆయన అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేసిన కవిత నిన్న మీటింగ్ పెట్టిందని, బీసీలకు మంత్రి పదవి ఇచ్చి ఎదుగుతుంటే ఈటల రాజేందర్ ను ఓర్వలేక తీసేశారని, నిజాయితీగా ఉంటే కేసీఆర్ బీసీలకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు.

Kadapa: డిప్యూటీ సీఎం ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం.. విచారణ వేగవంతం

Show comments