హరీష్ మాటలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్‌కు చులకనభావం.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదన్నారు.
Duddilla Sridhar Babu : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే BRS పార్టీ నిరంతరం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు, పారదర్శకంగా నడుస్తున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారానికి దిగడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం BRS పార్టీకి అలవాటైందని ఆయన అన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఇటీవల ప్రైవేట్ వ్యక్తుల పేరిట జరుగుతున్న వ్యవహారంపై సీఎం స్వయంగా సుప్రీంకోర్టులో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. “కోర్టు తీర్పు…
Ponguleti Srinivas Reddy : గచ్చిబౌలి భూముల వివాదంపై బీఆర్‌ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు 400 ఎకరాల భూమి విషయాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్ ఇప్పుడు అప్రసక్తమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. అంతేకాదు, ఈ భూములను తమ అనుబంధ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసిన చీకటి ఒప్పందాల వెనుక ఆ పార్టీనే ఉందని ఆరోపించారు. గచ్చిబౌలి భూముల వివాదం పెరుగుతున్న నేపథ్యంలో…
MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎవరిని భయపెట్టదని, కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేదన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం…ఎక్కువ ఎగిరిపడితే జనాలు మళ్ళీ బండకేసి కొడతారన్నారు. దర్యాప్తు సంస్థలు తప్పు చేసిన వారిని ఏ కలుగులో దాక్కున్నా పట్టుకువచ్చి విచారణ చేస్తాయని, కవిత తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి…
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని, కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో…
MLA Sticker : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే గా మేడిపల్లి సత్యం, గెలిచి నేటితో సంవత్సరం గడుస్తున్నా.. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురుకుల బాట కార్యక్రమంలో, ఎమ్మెల్యే స్టిక్కర్ కెమెరాకు చిక్కింది.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోయి ఏడాది గడిచింది.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్…
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ స్థాపనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఇతర రెవెన్యూ అధికారులపై స్థానికుల దాడి జరిగింది. ఈ దాడిలో అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు.