శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యనించారు.
సామాజిక యాత్ర పై వాడ వాడలా చర్చ జరుగుతుంది అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీ సీఎం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై చర్చ జరుగుతుంది.. పేదరికాన్ని తొలగించాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు.
సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సామాజిక యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదు.. సామాజిక విప్లవానికి ప్రతీక ఈ యాత్ర అని ఆయన పేర్కొన్నారు.
వెనుక బడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.
నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 175 నియోజక వర్గాలలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. breaking news, latest news, telugu news, botsa satyanaryana, samajika sadikara bus yatra