కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈరోడ్ ఎంపీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) సీనియర్ కార్యకర్త 77 ఏళ్ల ఎ. గణేశమూర్తి, మార్చి 28, 2024 గురువారం నేటి ఉదయం 5.05 గంటలకు గుండెపోటుతో మరణించారు. మార్చి 24న విషం తాగి ఈరోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
Also Read: Tirumala: తిరుమలలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
అనంతరం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండగా.. ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
Also Read: Hyderabad: రంజాన్ మాసం.. చార్‌మినార్ వద్ద వ్యాపారులకు నగర సీపీ గుడ్ న్యూస్
గణేశమూర్తి మొత్తంగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతదేహాన్ని ఈరోడ్ లోని పెరియార్ నగర్ లోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఆత్మహత్య గల కారణం ఆయనకు పార్టీ నుండి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వకవపోవడమే కారణమని తెలుస్తోంది.