టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో టాలీవుడ్ సినిమాటిక్ బాండ్ ఒకటి ఏర్పరచుకుంది. ఫిల్మీ ఇండో టర్కిష్ అలయన్స్ వ్యవస్థాపకుడు, తజాముల్ హుస్సేన్ టర్కీ- తెలుగు చలనచిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక, సినిమాటిక్ బంధాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ టైకూన్ గా భావించే తజాముల్ హుస్సేన్ తెలుగు సినిమాతో సంబంధాలను పెంచుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అందుకే హుస్సేన్ ఇటీవల తెలుగు చలనచిత్ర ప్రముఖులతో భేటీ అయ్యేందుకు టర్కీ నుండి భారతదేశంలోని తెలంగాణ వచ్చారు. ఈ క్రమంలో తెలుగు సినిమా రంగంలోని కీలక వ్యక్తులతో ఆయన భేటీ అయ్యారు. తెలుగు హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ విష్ణు మంచుతో సమావేశమయి తన ప్రణాళిక చెప్పగా మంచు విష్ణు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
RX 100 Sequel: ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ ప్లాన్ బయటపెట్టిన కార్తికేయ
ఆ తరువాత హుస్సేన్ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి మాజీ అధ్యక్షుడు శ్రీ బసి రెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో టర్కీ చలన చిత్ర విషయాలు మాత్రమే కాకుండా, పర్యాటక చరిత్రను, టర్కీ ప్రభుత్వం అందించే రాయితీలు, అలాగే పన్ను రాయితీలతో సహా ప్రోత్సాహకాల గురించి కూడా టాలీవుడ్ ప్రతినిధులకు హుస్సేన్ వివరించారు. ఇక ఈ క్రమంలో టర్కిష్- తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాయని భావిస్తున్నారు. ఇక మరోవైపు భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఏకం చేసే విధంగా ఇటీవలే విష్ణు మంచు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మా ప్రెసిడెంట్ హోదాలో మంచు విష్ణు, కోశాధికారి హోదాలో శివ బాలాజీ జూన్ 17న ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళను కలిసి రెండు అసోసియేషన్ లు కలిసికట్టుగా ఉండాలి అనే ప్రతిపాదన ఉంచారు. దానికి హిందీ పరిశ్రమ అంగీకారం తెలిపగా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారు.