NTV Telugu Site icon

MP Chamala Kiran : అక్రమ నిర్మాణాలు కూల్చాలన్న కేటీఆర్.. జన్వాడ ఫాంహౌస్‌ కూల్చివేతపై స్టే ఎందుకు?

Chamala Kiran Kuma Reddy

Chamala Kiran Kuma Reddy

కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు. రంగనాథ్ కి అక్రమ నిర్మాణం ఉంటే లేఖ ఇవ్వాలని.. తాము చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా ఎవరు నిర్మాణం చేసినా.. చర్యలు తీసుకుంటారని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు.

READ MORE: Kishan Reddy: ఇంతకి ఇది హైడ్రా నా.. హై డ్రామానా?

సోషల్ మీడియాలో మాపై కామెంట్ చేస్తున్నారని.. మేము రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేసుకుంటున్నారని ఎంపీ తెలిపారు. కేటీఆర్.. ఆయన కేటు గాళ్ళు మా అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారన్నారు. ఎంపీ ట్వీట్ కి కౌంటర్ కి ఒక రేటు.. సీఎం ట్వీట్ పై కౌంటర్ కి ఒక రేటు తో పోస్టు పెట్టే చిల్లర కేటుగాళ్లు ఉన్నారన్నారు. మీలాగా మావి చీకటి బతుకులు కావని చెప్పారు. ప్రతీ రైతుకు రుణమాఫీ అవుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పొరపాట్లు ఉంటే కొంత ఇబ్బంది జరుగుతుందని పేర్కొన్నారు. తప్పిదాలు ఉంటే నోడల్ అధికారులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం 31 వేల కోట్లు రుణమాఫీ డబ్బులు విడుదల చేసిందని గుర్తు చేశారు. లబ్ధిదారులకు పంపే పనిలో సర్కార్ ఉందన్నారు.