MP Aravind : రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల స్కామ్ జరిగిందని, 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారు మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే పనికి రెండు రకాల నిధులు వినియోగించారని, తప్పుడు నివేదికలు సమర్పించారన్నారు. జరిగిన పనుల్లోనూ 25 శాతం కమిషన్ లు తీసుకున్నారని, తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిన నిధులను, కేసీఆర్ కుటుంబానికి మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు.
Also Read : Opposition Meeting: బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం.. హాజరుకానున్న ముఖ్య పార్టీ నేతలు..!
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించినట్టు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారని.. శిలా ఫలకం మీద మాత్రం రుణం తీసుకున్న నిధులతో నిర్మించినట్టు పేర్కొంటున్నారని అన్నారు. ఒక పనిని రెండు నిధులతో ఎలా చేస్తారని.. మిగిలిన నిధులు ఎటు మళ్లించారని ప్రశ్నించారు. చేసిన పనిలోనూ ప్రశాంత్‌రెడ్డి 25 శాతం కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే త్వరలో కవిత.. దిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో ముఖం చెల్లక విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే.. సిద్దిపేటలో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించినట్లు పేర్కొన్నారు.
Also Read : Old City Metro : పాతబస్తీలో మెట్రో… సన్నాహక పనులను ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!