నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనకు, ప్రారంభోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం ఎందుకివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ లో కేంద్రం నిధులను ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధుల దుర్వినియోగంపై ఆయన ధ్వజమెత్తారు. పంట నష్టం క్షేత్ర స్థాయిలో అంచనా వేయకుండానే ఎలా నిర్ణయించారన్న ఎంపీ అరవింద్.. పంచాయతీల తీర్మాణం లేకుండా అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్ ఎలా ఇస్తున్నారని సర్పంచుల మండిపడ్డారు. ప్రజా వ్యవస్థను, అన్నీ వ్యవస్థలను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేస్తుందని ఎంపీ అరవింద్ సీరియస్ అయ్యారు.
Also Read : Kushi: ఖుషీ సమంత రియల్ లైఫ్ స్టోరీనా.. శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్?
అంతేకాకుండా.. మంత్రి ప్రశాంత్ రెడ్డికి కస్టర్డ్ ఆపిల్ కు జామపండుకి తేడా తెల్వదన్నారు ఎంపీ అరవింద్. కవిత కాంగ్రెస్ నేతలని పొగుడుతుంటే మంత్రి ప్రశాంత్ మొహం వాడిపోయిందన్నారు ఎంపీ అరవింద్. కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కవితని పొగుడ్తుంటే… కవిత మాత్రం కాంగ్రెస్ వాళ్ళని పొగుడుతుందని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. కవిత, మంత్రి ప్రశాంత్ పసుపు రైతులకు చేసిందేమి లేదన్నారు. పసుపు ఎగుమతులను పెంచాం కాబట్టే రైతులకు మంచి ధరలు వస్తున్నాయని ఎంపీ అరవింద్ చెప్పారు. ఈ సారి కవిత తనపై పోటీ చేస్తే మూడో స్థానానికే పరిమితం అవుతుందన్నారు.
Also Read : Varalakshmi Sarathkumar: డ్రగ్స్ కేసులో జయమ్మకు ఎన్ ఐ ఏ నోటీసులు..