తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రకి పరిచయం అయింది తన అద్భుతమైన నటనతో అందరినీ ఎంతగానో మెప్పించింది. కెరీర్ మొదటిలో హీరోయిన్ గా నటించిన వరలక్ష్మి అంతగా ఆకట్టుకోలేదు. ఈ భామ ఆ తరువాత పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలలో నటించి మెప్పించింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా అద్భుతంగా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామ అప్పటి నుంచి జయమ్మ గా పిలవబడుతుంది. ఆ తరువాత కూడా ఈభామ వరుసగా లేడీ విలన్ క్యారెక్టర్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా కేరళలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎన్ ఐ ఎ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..
కేరళ రాష్ట్రంలోని విలన్జియం సమీపంలో డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో ఆ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆదిలింగంను ఎన్ ఐ ఏ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సినీనటి వరలక్ష్మికి పీఏగా పనిచేసిన ఆదిలింగం డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో డ్రగ్స్ కి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఏమైనా సంబంధాల ఉన్నాయా అన్న కోణంలో ఎన్ ఐ ఏ అధికారులు ఆమెను విచారణ చేయనున్నారు .వరలక్ష్మికి పిఏగా పనిచేసిన అది లింగం గతంలో అనేకసార్లు ఆమెకి డ్రగ్స్ ఇచ్చినట్టుగా ఎన్ ఐ ఏ అనుమానిస్తుంది .. డ్రగ్స్ అమ్మిన ద్వారా వచ్చిన డబ్బును సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ ఐ ఏ గుర్తించింది.. ఆయనకు సంబంధించిన అనేక విషయాలపై పూర్తిస్థాయిలో సమాచారం రాబట్టడం కోసమే అధికారులు వరలక్ష్మి శరత్ కుమార్ కి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.గతంలో ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది డ్రగ్స్ కేసు లో విచారణ ఎదుర్కొన్నారు .టాలీవుడ్ లో దాదాపు 13 మంది హీరో హీరోయిన్లు విచారణ ఎదుర్కొన్నారు.ఇప్పుడు తాజాగా కోలీవుడ్ కు సంబంధించిన ప్రముఖ హీరోయిన్ గా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ని డ్రగ్స్ కేసు విచారణకు పిలవడంతో ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.