గొర్లను మింగేటోడు కేసీఆర్ అయితే, బర్లను మింగేటోడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నేనే కట్టిన అనే చంద్రబాబు ఇక్కడ అభ్యర్థులను ఎందుకు పెట్టడం లేదన్నారు ఎంపీ అరవింద్. అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడని విమర్శించారు. అవినీతి కేసీఆర్ ను మించిన రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు కంట్రోల్ ఉంటాడని, చక్కెర ఫ్యాక్టరీలను నాశనం చేసింది చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. మేము ముస్లింలను కూడా ఓట్లు వేయాలని కోరుతున్నామని, రానున్న కాలంలో ముస్లిం బస్తీలకు కూడా రోడ్ షో లు వస్తాయన్నారు ఎంపీ అరవింద్. కార్పొరేటర్, కౌన్సిలర్ లను కొని రాజకీయాలు చేయడం లేదు ప్రజలను నమ్మి రాజకీయాలు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Revanth Reddy: బండి సంజయ్ కి బుర్ర పని చేస్తున్నట్టు లేదు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
డిసెంబర్ 4వ తేదీన 20 మంది కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే లుగా పోటీ చేసే వాళ్ళు బీఆర్ఎస్ లో చేరతారని చెప్పారు. అందుకే రైతుల ఓట్లు వృధా కాకుండా బీజేపీని గెలిపించాలని కోరారు.దేశంలో చెరకు ఫ్యాక్టరీలు ఏ రకంగా నడపాలో కేంద్ర ప్రభుత్వానికి ఒక పాలసీ ఉందని ఎంపీ అరవింద్ వ్యాఖ్యనాఇంచారు. బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక బద్ద పాలసీలతో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి నడిపిస్తుందన్నారు. మూతపడ్డ చాలా ఫ్యాక్టరీలను రాష్ట్రాలలో తెరిపించామన్నారు. పసుపు బోర్డు కాస్త ఆలస్యమైన ఇచ్చిన మాట ప్రకారం నేరవేర్చమని చెప్పారు. బీడీ కార్మికుల సమస్యలు బాగా ఉన్నాయని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
Also Read : Revanth Reddy: తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. కేటీఆర్.. నన్ను, రాహుల్ ను తిడుతాడేంటి..!