Revanth Reddy: తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. కేటీఆర్.. నన్ను, రాహుల్ ను తిడుతాడేంటి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్ గాందీని నన్ను కేటీఆర్ తిడుతున్నాడు టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అయిన అధికారి మురళీధర్ రావు కు బాధ్యతలు ఇచ్చి తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడిగడ్డ మళ్ళీ కూలగొట్టి కొత్తది కట్టాలి అంటున్నారు నిపుణులు అని తెలిపారు. కూలిన దాన్ని ఎల్ అండ్ టి కడుతుంది అంటున్నారు.. ఇంకో ఆరు నెలలు అయితే కంపనీ గడువు కూడా ముగుస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. ఆరు నెలల తరవత ఏదైనా జరిగితే బాద్యులు ఎవరు? అని ప్రశ్నించారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక పై సీబీఐ విచారణ కి కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదన్నారు. అవకతవకలు పై బాద్యులందరి పై కేసులు పెట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కి ప్రొటెస్ట్ మని ఇస్తున్నదని ఆరోపించారు. అందుకే దీనిపై విచారణ చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ దగ్గరే .. సాగు నీటి శాఖ ఉందన్నారు. మరి ఎందుకు నోరు మెదపడం లేదు ? అని ప్రశ్నించారు. బాద్యులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నాడు? అని ప్రశ్నించారు. నీ తప్పిదం లేకుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్నారు.
సీతారామలో 500 కోట్లకు అంచనా పెంచి కేసీఆర్ బంధువు ప్రతిమ వాళ్లకు ఇచ్చారన్నారు. అగ్రిమెంట్ సమయంలో తక్కువ ధరకు ఇచ్చి.. రేవైజ్ లో ధర పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేసీఆర్ దోపిడీకి తెర లేపారన్నారు. మెడిగడ్డ ప్లానింగ్ వేరు.. డిజైన్ అనుకున్నది ఒకటి చేసింది ఒకటి అని మండిపడ్డారు. నేనే ఆలోచన చేసి.. మెదడు, రక్తం ధారపోసి కట్టిన అన్నారు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కుంగి పోగానే.. సాంకేతిక నిపుణుల మీద తోసి పనిలో పడ్డారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాలు 38, 500 కోట్ల ను లక్ష 51 వేళా కోట్లకు పెంచిందన్నారు. పెంచుకున్న బడ్జెట్ లో అయినా నాణ్యతతో ఉంటే.. బాగుండేదని వ్యంగాస్త్రం వేశారు. కాళేశ్వరంలో కూడా 80 వేల కోట్లు అగ్రిమెంట్ లో పెట్టి లక్ష 50 వేళా కోట్లకు పెంచారని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అంటూ నిప్పులు చెరిగారు. ఈ టెర్రరిస్టులను వెంటనే శిక్షించాలి కేంద్రం అని డిమాండ్ చేశారు. కేంద్రం బీఆర్ఎస్ కి సహకరించడంతోనే ప్రాజెక్టుల అవినీతి మయం అయ్యిందన్నారు. మెడిగడ్డ ఇష్యుని డైవర్ట్ చేసే పనిలో బీఆర్ఎస్ ఉందన్నారు. కేంద్రం.. ఇతర రాష్ట్రాల్లో ఉండే అధికారులతో విచారణ జరగాలని తెలిపారు. సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన విచారణ జరగాలన్నారు. 2014 నుండి మంత్రులుగా ఉన్న హరీష్.. కేసీఆర్ లను అధికారం నుండి తప్పించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chhattisgarh Election 2023: ఛత్తీస్‌ఘడ్‌లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్..!
Also Read
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!