Motorola Edge 50 Neo 5G Smartphone Discounts: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 అల్ట్రాలను ఇప్పటికే లాంచ్ చేసిన మోటోరొలా.. తాజాగా ఎడ్జ్ 50 నియోను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మోటోరొలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో విక్రయాలు అందుబాటులో ఉంటాయి. ప్రధాన బ్యాంకు కార్డులపై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ఉంటుంది. ఎక్స్ఛేంజ్ బోనస్‌పై అదనంగా మరో వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక రిలయన్స్ జియోతో పాటు రూ.10 వేల విలువైన ప్రయోజనాలను బండిల్డ్ ఆఫర్ కింద అందిస్తున్నారు.
ఎడ్జ్ 50 నియో 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం సింగిల్ వేరియంట్‌లో మాత్రమే వస్తోంది. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. పండగ సీజన్ ఆఫర్‌లో భాగంగా ఈ ధరకే అందిస్తున్నట్లు మోటోరొలా తెలిపింది. ఎడ్జ్ 50 నియోలో 6.4 ఇంచెస్ ఫ్లాట్ ఎల్‌టీపీఓ పీఓల్‌ఎఈడీ ప్యానెల్‌ను ఇచ్చారు. 1.5K రిజల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్ ఉంది. ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తున్న ఎడ్జ్ 50 నియోలో మీడియాటెక్ డైమెన్‌సిటీ 7300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఐదేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కంపెనీ ఇస్తోంది.
Also Read: Rohith Sharma: బంగ్లా కోసం ప్రత్యేక ప్రణాళికలేమీ రచించాల్సిన పని లేదు: రోహిత్
ఎడ్జ్ 50 నియో 5జీ వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 ఎంపీ టెలిఫొటో లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా ఉంటుంది. మోటో ఏఐ సూట్ సాయంతో ఫొటో ప్రాసెసింగ్, స్టైల్ సింక్, అడాప్టివ్ స్టెబిలైజేషన్ 30 ఎక్స్ సూపర్ జూమ్ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 4310 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వగా.. ఇది 68 వాట్స్ టర్బో పవర్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటో ఏఐ సూట్‌ను ఇందులో మోటోరొలా అందిస్తోంది.