Leopard Catch: కర్ణాటకలోని తుమకూరు జిల్లా రంగ్‌పూర్ గ్రామంలో ఓ చిరుతపులి వచ్చి ప్రజలపై దాడులను చేస్తుండేది. ఈ చిరుతపులిని అటవీ అధికారులతో పాటు కొందరు గ్రామస్తులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, చిరుతను పట్టుకునే సమయంలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి పారిపోతున్న చిరుతపులి తోక పట్టుకుని బోనులో బంధించాడు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Also Read: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో గమనించినట్లయితే.. యూనిఫాంలో ఉన్న కొందరు అధికారులు వల, ఒక్క లావుపాటి కర్రతో చిరుతను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అలాగే వారితోపాటు కొందరు గ్రామస్థులు కూడా ఉన్నారు. ఈ సమయంలో యువకుడు చిరుతపులి తోకను బలంగా వెనక నుండి పట్టుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. దీంతో ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. చిరుత తోక పట్టు కోవడంతో అక్కడ కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో ఘటనను వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి కూడా వెనక్కి తగ్గాడు. దీంతో ఆ యువకుడు చిరుతను బోనులో ఎలా పెట్టగలిగాడో సరిగా రికార్డు కాలేదు. ఏది ఏమైనా చిరుతను వెనుక నుండి తోకను పట్టుకొని బంధించడం నిజంగా ఆచ్చర్యకరం.
Indeed, a filmy capture of a leopard in Karnataka. pic.twitter.com/0tKtRqKlFF
— Ajay Kumar (@ajay_kumar31) January 7, 2025
ఈ చిరుతపులి కారణంగా, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. పురాలేహళ్లి రోడ్డు సమీపంలో ఆనంద్ కుమార్ ఇల్లు ఉంది. జనవరి 6న ఇక్కడ చిరుతపులి కనిపించింది. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని, వల వేసి చిరుతను పట్టుకునేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇక ఈ వీడియో చుసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.